ఫిజ్జ కంటే ఫాస్ట్ గా లిక్కర్ డెలివరీ : : ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో ఇంటి ముందుకు

Online trend ను క్యాష్ చేసుకోవాలనుకుందో Startup Company. దాదాపుగా అన్నీ ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల App లు దీనికి సంబంధించిన అందుబాటులో ఉన్నాయి

కోల్కతా :  Online trend ను క్యాష్ చేసుకోవాలనుకుందో Startup Company. దాదాపుగా అన్నీ ఆన్ లైన్ లోనే దొరికేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల App లు దీనికి సంబంధించిన అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ల హవా నడుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే కోరుకున్న కూరగాయలు, దుస్తులు, ఆట బొమ్మలు  వంటివన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. మరి తమ వ్యాపారం ఎలా.. ఏది చేస్తే లాభాలొస్తాయి. అని ఆలోచించిందో స్టార్టప్ కంపెనీ.. అంతే, ఆన్ లైన్ ఇదే బాటలో Alcohol సరఫరాను కొత్తపుంతలు తొక్కించాలనుకుంది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇంకేముంది దీనికో పేరు కూడా క్రియేట్ చేసి రంగంలోని దిగింది.  ’బూజీ‘  బ్రాండ్ పేరుతో కోల్కతాలో వినూత్న సేవలను తాజాగా ప్రారంభించింది. ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో లిక్కర్ ను డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. మరి ఇప్పటివరకు ఆన్ లైన్ లో మద్యం అందుబాటులో లేదా అంటే.. ఎందుకు లేదూ...  వాస్తవానికి ఇప్పటికే పలు కంపెనీలు ఆన్లైన్ లో మద్యం డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి.  అయితే, ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే.. మద్యం మీ ఇంటిముందుకు చేర్చే సేవలను అందిస్తున్న కంపెనీ మాత్రం తమదేనని ఎండోమెంట్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అదన్నమాట.. మందేయాలనుకుంటే ఆగేది ఉండదు కదా.. అందుకే అనుకున్నదే తడవుగా కళ్లముందు ప్రత్యక్షం అన్నమాట. దీనికోసం పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని ఈ సర్వీసును ప్రారంభించినట్లు వెల్లడించింది. 

khaja

Comment As:

Comment (0)