పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ఓ ప్రేమజంట పెళ్లిచేసుకుని మండల పోలీసులను ఆశ్రయించింది. మండలంలోని ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన మందా గోపి, తన మేనకోడలు వరసైన నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన కిరణ్మయిలు ఇద్దరూ ప్రేమించుకున్నారు
- By khaja --
- Friday, 03 Jun, 2022
నాదెండ్ల: ఓ ప్రేమజంట పెళ్లిచేసుకుని మండల పోలీసులను ఆశ్రయించింది. మండలంలోని ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన మందా గోపి, తన మేనకోడలు వరసైన నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన కిరణ్మయిలు ఇద్దరూ ప్రేమించుకున్నారు. గోపి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా కిరణ్మయి డిగ్రీ చదువుతోంది. కిరణ్మయి తండ్రి కంభంపాటి రాంబాబుకు వీరి ప్రేమ నచ్చలేదు. కుమార్తె కనబడటం లేదని నరసరావుపేట టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వీరిద్దరూ పెళ్లిచేసుకుని నాదెండ్ల మండల పోలీసులను ఆశ్రయించారు...!!
khaja