ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఓడీసీఎంఎస్ ఛైర్మన్

ఖానాపురం సోసైటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓడీసీఎంఎస్ చైర్మన్ , మార్క్ ఫేడ్ డైరెక్టర్ గుగులోతు రామస్వామి నాయక్ సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి

ఖానాపురం సోసైటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓడీసీఎంఎస్ చైర్మన్ , మార్క్ ఫేడ్ డైరెక్టర్ గుగులోతు రామస్వామి నాయక్ సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాన్యం కొనుగోలు వేగివంతం చేయాలన్నారు. అశోక్ నగర్ ,ఖానాపురం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నియామల ప్రకారం ధాన్యం తీసుకురావాలని రైతులకు సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంటాలు పూర్తైన ధాన్యం మిల్లులకు పంపాలని,రైతులు తమ దాన్యం తడవకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటి డైరక్టర్లు వేణు కృష్ణ, గంగాధరి రమేష్ ,సీఈఓ ఆంజనేయులు సిబ్బంది వెంకటేశ్వర్లు, రాజు ,వినయ్ , రైతులు పాల్గొన్నారు.

mallesh Reporter

Comment As:

Comment (0)