తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు...3 రోజులు వర్షాలు వాతావరణ కేంద్రం
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- By khaja --
- Monday, 13 Jun, 2022
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు, రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. రాష్ట్రంలోకి రుతువపనాల రాకతో వాతావరణం చల్లబడింది. రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే విధంగా గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
khaja