చత్తీస్ ఘడ్ లోని క్యాంపుపై మావోయిస్టుల దాడి
చత్తీస్‌ఘడ్‌లో గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి.
- By khaja --
- Thursday, 23 Jun, 2022
Maoists Attack: చత్తీస్‌ఘడ్‌లో గంటపాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై గంటసేపు మావోయిస్టులకు సీఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్యాంప్ కార్యాలయాన్ని దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల కొండకింద హీరోలిలో గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేశారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఏఎస్పి రాజేంద్ర జైస్పాల్ ధ్రువీకరించారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పట్‌ధారలో కొత్త సీఆర్‌పీఎఫ్ శిబిరం ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. అంతకుముందు, అల్ట్రాలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో శిబిరాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు వేసి, CRPFకి మద్దతు ఇవ్వొద్దని ప్రజలను హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో ఆ ప్రాంత వాసుల్లో భయాందోళన నెలకొంది.
khaja