గోవా నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు..8మంది సజీవ దహనం..!
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో గూడ్స్ లారీని ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది.ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది
- By khaja --
- Friday, 03 Jun, 2022
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో గూడ్స్ లారీని ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది.ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్‌కుమార్ (37), అతని భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివకుమార్ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నారు. మృతులు, క్షతగాత్రులను హైదరాబాద్ బొల్లారంలోని రిసాలబజార్‌కు చెందిన వారిగా గుర్తించారు.పుట్టినరోజు వేడుకల కోసం రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవాకు వెళ్లారు. వీరిలో 21 మంది ఓ కుటుంబం.. 11 మంది మరో కుటుంబం. తిరుగు ప్రయాణంలో బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా శ్రీరంగపట్నం-బీదర్ హైవేపై ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు రక్షించి కలబురిగి పరిధిలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
khaja