గోపవరం లో బోనాలు జాతర
గోపవరంలో బోనాలతో ఊరేగింపు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరంలో అమ్మవారి బోనాలసంబురం మొదలయ్యింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే.. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి
- By Ravan --
- Sunday, 17 Jul, 2022
గోపవరంలో బోనాలతో ఊరేగింపు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరంలో అమ్మవారి బోనాలసంబురం మొదలయ్యింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే.. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. డప్పు చప్పుళ్లతో గ్రామంలో రహదారులు మారుమోగాయి గోపవరం అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి .. తెల్లవారుజామునుంచే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో బోనాల వేడుక ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు జరిగాయి. అమ్మవారికి సాకలు సమర్పించి విశేషమైన నివేదన చేశారు. మొట్టమొదటి హారతిలో గ్రామంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. భక్తులు అమ్మవారికి బోనంతో పాటు సారెను సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇంట్లో తయారు చేసుకొని.. అమ్మవారికి సమర్పించి మిగిలినది మహా ప్రసాదంగా అంతా సేవిస్తారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది.
Ravan