ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం కాలేజీ సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం కాలేజీ సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈసందర్భంగా ఎంపిపీ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభిమాన నటుడు,యుగపురుషుడు నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడిద కుమార్,కో-ఆప్షన్ సభ్యులు మాల్యాల పోశెట్టి, సత్యం,దేవినేని వేణుకృష్ణ, దేవినేని ప్రసాద్,దేవినేని వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
mallesh Reporter