అర్హులందరికీ త్వరలో టిడ్కో గృహాలు
మొదటగా వెంకటగిరి టిడ్కో గృహ సముదాయ ప్రాంగణంలో జరిగిన "మౌలిక సదుపాయాల కల్పన" ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు.
- By khaja --
- Saturday, 18 Jun, 2022
మొదటగా వెంకటగిరి టిడ్కో గృహ సముదాయ ప్రాంగణంలో జరిగిన "మౌలిక సదుపాయాల కల్పన" ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి అక్క చెల్లెమ్మకు శాశ్వత గృహం ఉండాలనే సదుద్దేశంతో టిడ్కో గృహ సముదాయల్లో మౌళిక సదుపాయలను కల్పించి పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి ఈ ఏడాది చివరకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించెందుకు చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. తదుపరి నిర్మాణంలో టిడ్కో గృహ సముదాయలని పరిశీలించారు. ఎక్కడా నాణ్యతలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, టిడ్కో చైర్మన్ జె. ప్రసన్న కుమార్, వెంకటగిరి మునిసిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, గ్రంధాలయ కమిటీ చైర్మన్ దొంతు శారదా, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
khaja