హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో "హెల్త్ సబ్ సెంటర్" నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదల వైద్య సేవల కొరకు అవసరమైన హెల్త్ సెంటర్ నిర్మాణం కొరకు శకుంతలా దేవి- బుచ్చి రామారావు

ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో "హెల్త్ సబ్ సెంటర్" నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదల వైద్య సేవల కొరకు అవసరమైన హెల్త్ సెంటర్ నిర్మాణం కొరకు శకుంతలా దేవి- బుచ్చి రామారావు గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు బలుగూరి వేణుగోపాల్ రావు దంపతులు సొంత భూమిని విరాళంగా అందించినందున బుధరావు పేట ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసారు. నియోజకవర్గంలో 59 సబ్ సెంటర్లో గాను 57 హెల్త్ సెంటర్ల కి మంజూరు ఇచ్చాము.వీటి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తిచేసి పేద ప్రజల ఆరోగ్య అవసరాలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఎంపిటిసిలు షేక్ సుబాన్ భీ మౌళాన, బిక్కిలింగమ్మమురళి, సర్పంచ్ కాసప్రవీణ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

mallesh Reporter

Comment As:

Comment (0)