సోషల్ మిడియా పై గట్టి నిఘా ఉంచాలి - జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్.

కర్నూలు పోలీసు రీజనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను శనివారం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడారు.సోషల్ మిడియా పై గట్టి నిఘా ఉంచాలని సైబర్ ల్యాబ్

కర్నూలు పోలీసు రీజనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను శనివారం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడారు.సోషల్ మిడియా పై గట్టి నిఘా ఉంచాలని సైబర్ ల్యాబ్ పోలీసులకు తెలిపారు.ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని,సాంకేతిక నైపుణ్యంతో సైబర్ నేరాలను అరికట్టే దిశగా అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.సైబర్ నేరాల డేటా విశ్లేషణ,ప్రతి ఒక్క వింగ్ గురించి సైబర్ ల్యాబ్ ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.ఏదైనా అవసరమైనప్పుడు డేటాను వెంటనే విశ్లేషణ చేసి సత్వరమే స్పందించే విధంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐలు పవన్ కిశోర్,ప్రసాద్,సైబర్ ల్యాబ్ ఎస్సై వేణుగోపాల్ రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై రమేష్,సైబర్ ల్యాబ్ టెక్నిషియన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

V.VIJAY KUMAR

Comment As:

Comment (0)