సోమవారం కాగజ్ నగర్ లో బీఎస్పీ భారీ బహిరంగ సభ
సిర్పూర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికార రెండవ విడత యాత్ర పది రోజులపాటు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కాగా సోమవారం కాగజ్నగర్ పట్టణంలో మధ్యాహ్నం 2:30 కు బైక్ ర్యాలీ నిర్వహించి
సిర్పూర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికార రెండవ విడత యాత్ర పది రోజులపాటు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కాగా సోమవారం కాగజ్నగర్ పట్టణంలో మధ్యాహ్నం 2:30 కు బైక్ ర్యాలీ నిర్వహించి సాయంత్రం 4-00 గంటలకు అంబేద్కర్ చౌక్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయనునట్టు సిర్పూర్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ అర్షద్ హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర బీఎస్పీ పార్టీ సెక్రటరీ (మాజీ జిల్లా పరిషత్ చైర్మన్) సిడెం గణపతి, గాయకులు రాంబాబు విచ్చేయనున్నట్టు ఆయన తెలిపారు. బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీ కులస్తులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయగలరని కోరారు.
KOTA SAIKRISHNA