సోనూసూద్ ఫౌండేషన్ పేరిట ఫేక్ కాల్.. రూ.25 వేలు మాయం
సోనూసూద్ ఫౌండేషన్ పేరిట ఫేక్ కాల్.. రూ.25 వేలు మాయం
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన కోట వెంకటస్వామికి సోనూసూద్ ఫౌండేషన్ పేరిట కాల్ వచ్చింది. ఇటీవలే వెంకటస్వామికి చెల్లెలికి MBBS సీటు వచ్చింది. అయితే ఫౌండేషన్ తరఫున చదివించేందుకు అండగా ఉంటామని ఓ లింక్ పంపి క్లిక్ చేయమన్నారు. వారిని నమ్మి లింక్ ఓపెన్ చేయడంతో వెంకటస్వామి ఖాతా నుంచి రూ.25,539 కట్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
KOTA SAIKRISHNA