సామ్రాజ్యవాదం, మతోన్మాదాలను తరిమికొట్టండి...

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన కామ్రేడ్ భగత్ సింగ్,కామ్రేడ్ రాజ్ గురు,కామ్రేడ్ సుఖ్ దేవ్ ల "91వ వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరపాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ విద్యార్థి లోకానికి పిలుపునివ్వడ

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన కామ్రేడ్ భగత్ సింగ్,కామ్రేడ్ రాజ్ గురు,కామ్రేడ్ సుఖ్ దేవ్ ల "91వ వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరపాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ విద్యార్థి లోకానికి పిలుపునివ్వడమైంది. స్థానిక నల్లగొండ పట్టణంలో PDSU నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం అయినది.

పోస్టర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో మతోన్మాదం పెరిగితే అది సామ్రాజ్యవాదం కన్నా పెనుప్రమాదమైనదని మతోన్మాదాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు విద్యార్థులు పోరాటాలు చేయాలని అందుకు కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల స్ఫూర్తితో బలమైన ఉద్యమాలు నిర్మించాలన్నారు.

PDSU జిల్లా నాయకులు K.అంజిబాబు మాట్లాడుతూ నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ బాటలో పోరు జెండాను ఎత్తి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బొల్గూరి నవీన్ కుమార్,PDSU జిల్లా నాయకులు K.అంజిబాబు, AIFTU (New) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొంగరాల నరసింహ,PDSU నాయకులు కామ్రేడ్ సైదులు, సంతోష్, హరీష్, రాజు, రాజేష్, విక్రమ్, రవీందర్, కుమార్, రాకేశ్, విజయ్, అరవింద్, ప్రవీణ్ కుమార్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)