సమ్మె శిబిరంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించిన వీఆర్ఏలు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా వీఆర్ఏల బ్రతుకులు మారలేదని వీఆర్ఏ జేఏసీ నాయకులు అన్నారు. సంస్థాన్ నారాయణపురం ఎమ్మార్వో కార్యాలయం ముందు వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా వీఆర్ఏల బ్రతుకులు మారలేదని వీఆర్ఏ జేఏసీ నాయకులు అన్నారు. సంస్థాన్ నారాయణపురం ఎమ్మార్వో కార్యాలయం ముందు వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఇరవై రెండో రోజుకు చేరిన సందర్భంగా సమ్మె శిబిరం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గత 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని, ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల యొక్క హామీలను అమలు చేయకుంటే రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కార్యాచరణ ప్రకారం 16 తారీకు నుండి ఆగస్టు 26 వరకు వివిధ రకాలుగా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఇట్టి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. జిల్లా కోకన్వీనర్ పొట్ట మైసయ్య, గౌరవ అధ్యక్షులు మేకల వెంకటేష్, అధ్యక్షురాలు రాచకొండ సంతోష, ఉపాధ్యక్షురాలు మొగుదాల కవిత, అండాలు, మునీర్, గాలిబు, శైలజ, జ్యోతి, శాంతి, , బుచ్చయ్య, రాములు, దుర్గయ్య, లక్ష్మయ్య, సాయి, గాలయ్య పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)