షరతులు లేకుండా 2వ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

షరతులు లేకుండా 2వ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అసిఫాబాద్: ఎలాంటి షరతులు లేకుండా 2వ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పని చేస్తున్న 2వ ఏఎన్ఎంలను జీవో 16లో చేర్చి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టి, డీఎంహెచ్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేసారని అన్నారు. . ఏఎన్ఎంలను అలాగే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే బేసిక్-పే అమలు చేయాలని, తీవ్రమైన పని భారం తగ్గించాలని, టార్గెట్ల ఒత్తిడి, ఆన్ లైన్ వర్కర్స్ పేరిట సుమారుగా 16 గంటల పనిభారం, ఆర్థికంగా భారం వెంటనే తగ్గిచాలని అన్నారు. దీర్ఘకాలిక రోగులకు, సంక్రమిత వ్యాధులు గల రోగులకు సేవలందిస్తున్న వారికి 5వేలు రిస్క్ అలవెన్సు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Banka Srinivas

Comment As:

Comment (0)