శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ.80కోట్ల విలువైన కొకైన్ పట్టివేత..
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ.80కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా,కేఫ్ టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను
- By khaja --
- Monday, 02 May, 2022
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ.80కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా,కేఫ్ టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4కేజీల చొప్పున కొకైన్ బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ,మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగు అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించమన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అండడంతోనే నిఘా పెట్టి తనిఖీ చేశామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు...
khaja