విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జర్నలిస్ట్ జమీర్ కు ఘన నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం కలిచి వేస్తోంది. ఒక సంఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు పాఠకులకు అందించాలనే ఆత్రుతతో బయల్దేరిన
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం కలిచి వేస్తోంది. ఒక సంఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు పాఠకులకు అందించాలనే ఆత్రుతతో బయల్దేరిన జమీర్ దురదృష్ట వశాత్తు నీటి ప్రవాహంలో మునిగి గల్లంతు కావడం, కొన్ని రోజుల వ్యవధిలో విగత జీవిగా కనిపించడం జీర్ణించుకోలేక పోతున్నారు. జమీర్ ప్రత్యేక్షంగా నాకు తెలియదు. కాని ఒక జర్నలిస్ట్ గా మాత్రమే తెలుసు తాను వెళ్లే దారిలో మృత్యువు పొంచి ఉందన్న విషయం తెలిసినా, కల్వర్టుపై నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నా, కారులో ఈజీగా దాటగలుగుతాననే నమ్మకం ఆయనను ఈ సాహాసానికి ఒడిగట్టేలా చేయడం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్లి వరద దాటికి కొట్టుకుపోవడం తనతోపాటు ప్రయాణిస్తున్న వ్యక్తి ఎలాగోలా కారు నుంచి బయట పడటం మాత్రం ప్రయత్నించినా మూళ్ళ కంపలలో చిక్కుకొని మృత్యువుతో పోరాడుతూ మృతి చెందడం తలుచుకుంటే గుండె పిండేస్తుంది. రెండు రోజుల తరువాత ఆయన మృతదేహం లభ్యమైందనే వార్త వినే వరకు ఆయన మృతి చెంది ఉండకపో వచ్చు అని వార్త వింటా మని అనుకున్నాం కాని వారి కుటుంబ సభ్యులకు తీరని గుండెకోత మిగిల్చాడు. విధి నిర్వహణలో ఈ విధంగా ఎన్నోసార్లు ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కోవడం, బతికి బయట పడడం జర్నలిస్ట్ లకు కొత్తేమికాదు. కానీ జమీర్ కు జరిగినట్లుగా మరెవరికి ఇలా జరగకూ డదని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారుండాలని, జమీర్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాము . TWJF పెద్దపల్లి జిల్లా
MR.RAKESH NAMANI JOURNALIST