వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక నుంచి సరికొత్త లుక్ లో ఇలా..
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో(Family) కనెక్టెడ్‌గా ఉండేందుకు వాట్సాప్ వాడకం తప్పనిసరి. అందుకే వాట్సాప్ ఎప్పటిప్పుడు కొత్త అప్‌డేట్స్ తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తోంది.
- By khaja --
- Tuesday, 22 Feb, 2022
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో(Family) కనెక్టెడ్‌గా ఉండేందుకు వాట్సాప్ వాడకం తప్పనిసరి. అందుకే వాట్సాప్ ఎప్పటిప్పుడు కొత్త అప్‌డేట్స్ తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఐఓఎస్(IOS) యూజర్ల కోసం వాట్సాప్() ఓ కొత్త ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేసింది. వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేసేటప్పుడు కనిపించే స్క్రీన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఐఓఎస్ బీటా టెస్టర్ల కోసం రిలీజ్ చేసిన ఈ కొత్త వాయిస్ కాల్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. వాట్సాప్ బీటాఇన్ఫో నివేదిక ప్రకారం ఐఓఎస్ బీటా 22.5.0.70 కోసం వాట్సాప్ కొత్త వాయిస్ కాలింగ్ ఇంటర్‌ఫేస్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాయిస్ కాల్ లో ఉన్నప్పుడు కొత్త ఇంటర్‌ఫేస్ ను చూడవచ్చు. ఇందులో రియల్ టైమ్ వాయిస్ వేవ్‌ఫామ్స్ ఉంటాయి. వాయిస్ లెవల్స్‌లో వచ్చే మార్పులను ఈ వేవ్ ఫార్మ్స్ రూపంలో గుర్తించవచ్చు. ఈ కొత్త ఇంటర్ ఫేస్ గ్రూప్ కాల్స్ కు కూడా వర్తిస్తుంది. గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కరి వాయిస్ వేవ్‌ఫామ్ ఒక్కో కలర్ లో కనిపిస్తుంది. తద్వారా కాల్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్ డిస్టర్బ్ చేస్తుంటే అది ఎవరి నుంచి వస్తుందో కనిపెట్టొచ్చు. అలాగే స్క్రీన్ కింద భాగంలో ఒక పాప్‌అప్ విండో కనిపిస్తుంది. ఇక్కడ కాల్ ఎండ్ బటన్, మ్యూట్ బటన్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ బటన్స్ కనిపిస్తాయి. ఇటీవల, వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్ మెసేజ్ లు ప్లే అయ్యేవిధంగా ఐఓఎస్ యూజర్ల కోసం ఓ అప్‌డేట్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఓఎస్ యూజర్లు చాట్ విండో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియో మెసేజెస్ ను వినగలరు. ఈ అప్ డేట్ వాట్సాప్ వెబ్, ఐపాడ్, ఐఫోన్లలోని అన్ని వాట్సాప్ అప్లికేషన్లకు వర్తిస్తుంది. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్లు వాడేటప్పుడు ఎమోజీలు సెండ్ చేయడం కోసం వాట్సాప్ ఎమోజీ షార్ట్ కట్స్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఎమోజీకి సంబంధించిన కీవర్డ్ టైప్ చేసిన తర్వాత కాలన్ టైప్ చేయడం ద్వారా ఎమోజీని సెండ్ చేయవచ్చు. అలాగే ఫార్వార్డ్ వాయిస్ మెసేజ్‌ల కోసం వాట్సాప్ మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫార్వర్డ్ చేసిన వాయిస్ మెసేజ్‌లు ఆరెంజ్ రంగులో ఉండేలా ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. తద్వారా నార్మల్ వాయిస్ మెసేజ్ కు, ఫార్వర్డెడ్ వాయిస్ మెసేజ్ కు తేడా కనిపెట్టవచ్చు.
Khaja