రుణమాఫీకి అన్నదాత నిరీక్షణ
గద్వాల కలెక్టరేట్: వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు సాగుబాట పట్టారు. పత్తి, వేరుశనగ, ఆముదం, కంది, మొక్కజొన్న, జొన్నసాగు కోసం విత్తనాలు చల్లడంతోపాటు, బావుల దగ్గర వరి నారు పోసుకున్నారు.
- By khaja --
- Tuesday, 26 Jul, 2022
గద్వాల కలెక్టరేట్: వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు సాగుబాట పట్టారు. పత్తి, వేరుశనగ, ఆముదం, కంది, మొక్కజొన్న, జొన్నసాగు కోసం విత్తనాలు చల్లడంతోపాటు, బావుల దగ్గర వరి నారు పోసుకున్నారు.
అయితే చాలా మంది రైతులు తమకు రుణమాఫీ నిధులు చేతికి వస్తే పెట్టుబడికి ఎంతో ఆసరాగా ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. కొంత మంది రుణమాఫీకి ఎదురుచూస్తున్నా.. మరికొంత మంది పంట పెట్టుబడులను సమకూర్చుకోవడానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న బ్యాంకర్లు రుణాన్ని చెల్లించడమో.. లేక రెన్యువల్ చేసుకోవడమో చేయాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. బ్యాంకులో రుణాన్ని రెన్యువల్ చేయించుకుంటే రుణమాఫీ వర్తించదనే భయంతో చాలా మంది రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది...!!
khaja