రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు తుజ్జాల్పురం ప్రవీణ్ గౌడ్ సోమవారం తెలిపారు. హాకీ క్రీడలో శిక్షణ పొందుతున్న ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు వర్షిత్, సంజీవ్ యువ క్రీడాకారులు ఆసిఫాబాద్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 11 న డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో వారు పాల్గొని ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు హైదరాబాదులో ఈనెల21,22,23 తేదీలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనున్నట్లు తెలిపారు. వారికి ఈ స్థాయిలో శిక్షణ ఇచ్చిన జాతీయ హాకీ క్రీడాకారుడు కోచ్ అక్బర్, తిరుపతి లకు కృతజ్ఞతలు తెలిపారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)