ఆటో కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు.. జగిత్యాల ప్రతినిధి, మే19,(చాటింపు) పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలవుతుంటే, మోటార్ వాహన చట్టం పేరుతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు.. జగిత్యాల ప్రతినిధి, మే19,(చాటింపు) పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలవుతుంటే, మోటార్ వాహన చట్టం పేరుతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో వాహన కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ఇందిరా భవన్ లో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఒకప్రక్క ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రవాణా రంగ కార్మికుల జీవితాలు కుదేలు అవుతుంటే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం విడ్డురంగా ఉంది.వాహన ఫిట్నెస్ పేరుతో రోజుకు 50 రూపాయలు ఫెనాల్టీ భావ్యం కాదని,కోవిడ్ వల్ల ఇప్పటికే ఆటోరిక్షా కార్మికుల జీవితాలు దుర్భరమౌతుంటే ఇప్పుడు ఫిట్నెస్ ఫెనాల్టీ వారి జీవితాలకు గూదిబండగా మారిందని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఫెనాల్టీ పేరుతో రవాణా రంగ కార్మికుల జీవితాలలో ఆటలాడుతుంటే కార్మికుల పక్షాన ఉండవలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని హెద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వాహన రంగ కార్మికుల పక్షాన ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న వాహన రంగ కార్మికులకు ముఖ్యంగా జగిత్యాల ఆటో రిక్షా కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తన సంఘీభావం తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Pembi Mahendhar