మోదీ పాలనలో దేశం సురక్షితం: నడ్డా

హైదరాబాద్‌: ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందని, అభివృద్ధి కేంద్రంగా కొత్త రాజకీయాలు ప్రారంభమయ్యాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ స

హైదరాబాద్‌: ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందని, అభివృద్ధి కేంద్రంగా కొత్త రాజకీయాలు ప్రారంభమయ్యాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 20 ఏళ్లకు పైగా సేవలందించారని అన్నారు. ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌’ నినాదంతో ప్రజా సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని ప్రశంసించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపింది మోదీనే అన్నారు. దేశంలో అత్యున్నమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును ప్రకటించారని గుర్తించాలన్నారు. యూపీలో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది భాజపా ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. మోదీ నేతృత్వంలో జాతి, కుటుంబ, అవినీతి రాజకీయాలు అంతమయ్యాయని, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతి మొదలైందన్నారు. మోదీ పాలనలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించారని నడ్డా అన్నారు.

khaja

Comment As:

Comment (0)