మేడే స్పూర్తితో ఆదోని కార్మికుల హక్కులకోసం, పరిశ్రమల రక్షణకోసం పోరాడుదాము. AIFTU పిలుపు.
అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు ఇచ్చారు. మేడే ను పురస్కరించుకొని కొట్టాల లో జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్ర
అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు ఇచ్చారు. మేడే ను పురస్కరించుకొని కొట్టాల లో జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్రమలకు నిలయంగా ఉండి, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆదోని పారిశ్రామిక రంగం నేడు దివాళా తియ్యడానికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్షమే అని అన్నారు. పత్తి, మిరప, ఇక్కడ ప్రధాన పంటలు ఉన్న, ఇక్కడ బేళ్లు తయారయ్యే జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఉన్నా.. ధారాల పరిశ్రమ లేకపోవడం దురదృష్టం అని అన్నారు. ఇక్కడ ధారాల పరిశ్రమ రావడం అవసరం అని, అది వస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. అందుకే AIFTU ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆదోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం, ధారాల పరిశ్రమ స్థాపన కోసం పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు. జాన్ అధ్యక్షతన AIFTU జిల్లా అధ్యక్షుడు గంగన్న POW శ్రీ విముక్తి సుజ్ఞాన అమ్మ, నిర్మలమ్మ ,వీరమ్మ, మబి, RCC డివిజన్ నాయకులు రవివర్మ శేఖర్ అనిల్ కార్మిక సంఘం నాయకులు భాష సిద్ధ అశోకు రాజశేఖర్ దస్తగిరి రాజు AIFTU నాయకులు లక్ష్మన్న ,బాషా, రవి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
SRM