ముగ్గులు, కబడ్డీ పోటీలు

అసిఫాబాద్ మండలంలోని అంకుశపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు.

అసిఫాబాద్ మండలంలోని అంకుశపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, బిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)