మానవత్వం చాటుకున్న అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు.

అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్గొండ పట్టణం సింధూర హాస్పిటల్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు అచేతనంగా పడి ఉన్న విషయం చూసిన అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు వృద్ధుడు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నాడని గ్రహించి వెంటనే ఆ వృద్ధుడిని

అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్గొండ పట్టణం సింధూర హాస్పిటల్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు అచేతనంగా పడి ఉన్న విషయం చూసిన అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు వృద్ధుడు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నాడని గ్రహించి వెంటనే ఆ వృద్ధుడిని శుభ్రం చేసి, మంచి బట్టలు వేసి అల్పాహారం, మంచి నీరు అందించి, నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ లోని అమ్మ నాన్న ఆశ్రమం వారికి అప్పగించారు. నల్లగొండ పట్టణంలో ఒక రోజు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఇలాంటి వారిని సురక్షితంగా ఉంచడం కొరకు కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి తక్షణమే స్పందించి సహకారాలు అందిస్తున్న అన్నపూర్ణ సేవా సంస్థను, సేవ చేస్తున్న సభ్యులను అభినందించారు. చౌటుప్పల్ ఆశ్రమానికి వెళ్ళడానికి వాహనానికి డీజిల్ కొరకు పందిరి ఝాన్సీలక్ష్మి నారాయణ సహకారం అందజేశారు. అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్, సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట నాగరాజు, ఎల్లంలా శివరాం, కొండ నరేష్, కొప్పోలు గణేష్, మురళి పాల్గొన్నారు

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)