మంత్రిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
నాగార్జున సాగర్ హిల్ కాలనిలో శుక్రవారం జరిగిన కాగ్రెస్ సన్నాహాక సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నందికొండ కౌన్సిలర్లు మరియు టీఆరెస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్ట
- By khaja --
- Saturday, 30 Apr, 2022
నాగార్జున సాగర్ హిల్ కాలనిలో శుక్రవారం జరిగిన కాగ్రెస్ సన్నాహాక సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నందికొండ కౌన్సిలర్లు మరియు టీఆరెస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నల్గొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోతుంటే చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.నెల్లికల్ లిఫ్ట్ ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక చొరవతో యుద్ధ ప్రదీపాదికన పనులు చేపడుతున్న విషయం గుర్తించాలని అన్నారు.అలాగే నిడమనూర్ కోర్ట్ ,కనీసం గ్రామ పంచాయితిగా కూడా గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చొరవతో నాగార్జున సాగర్ ను మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసి నందికొండ గా నామకరణం చేసిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డి దే అన్నారు.నల్గొండ జిల్లా గత కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఫ్లోరైడ్ సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతుంటే చూసి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డి దే అని అన్నారు.రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నాయకులే అధ్యక్షులుగా గుర్తించడం లేదని అలాంటి వాళ్ళు నోటికి ఏదీపడితే అది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి,కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ,రమేష్ జి,మంగత నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం సాగర్ అధ్యక్షుడు మోహన్ నాయక్,ఎస్.సి సెల్ రాష్ట్ర నాయకులు ఆదాసు విక్రమ్,చంద్రమౌళి,సైదులు,వెంకటేశ్వర్లు,కొండయ్య,రాములు,చాంద్ పాషా,మల్లికార్జున్,వెంకట్ రెడ్డి,రంజిత్ రెడ్డి,మెండే సైదులు,నారాయణ రెడ్డి,నరేందర్ రెడ్డి,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
khaja