భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం కాపాడుకుందాం

సిఐటియు ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటాల ఫలితంగా సంక్షేమ చట్టాన్ని 1996లో తీసుకువచ్చిందని,దీనిని నిర్వీరం చేయడానికి ప్రస్తుత కేంద్ర,

సిఐటియు ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటాల ఫలితంగా సంక్షేమ చట్టాన్ని 1996లో తీసుకువచ్చిందని,దీనిని నిర్వీరం చేయడానికి ప్రస్తుత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని,దీన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని సిఐటియు నగర కార్యదర్శి ఎం.డి.అంజిబాబు తెలిపారు.శనివారం నగరంలోని కల్లూరు,సూర్య నారాయణ భవన్ లో శరీన్ నగర్ మట్టి పని కార్మికుల సమావేశం జి.ఏసు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ఎం.డి. అంజిబాబు,భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి కె.సుధాకరప్ప మాట్లాడుతూ గత కేంద్ర ప్రభుత్వం 1996లో సంక్షేమ చట్టాన్ని తీసుకుని వస్తే,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 నుంచి వై.ఏస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని అన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ చట్టానికి తూట్లు పొడిచి సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను దొంగ దారిలో ప్రభుత్వ,ఇతర పథకాలకు మళ్లించడం సరైన పద్ధతి కాదని అన్నారు.గత రెండు సంవత్సరాల నుండి భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదన్నారు.ప్రభుత్వం కార్మిక సంక్షేమ చట్టాన్ని కార్మికులకు అమలు చేయకుండా అన్యాయం చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరించారు.ప్రతి కార్మికుడు మన సంక్షేమ చట్టాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఒకవైపు ధరలతో అల్లాడుతున్న కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో పథకాలకు కోతలు విధించడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం చెందారు.సంక్షేమ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మరొక పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వెంకటరాముడు,దాసు, కృష్ణ మల్ల, శ్రీనివాసులు,ఈశ్వరమ్మ, మరియమ్మ,రమాదేవి, ఎల్లమ్మ,శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

V.VIJAY KUMAR

Comment As:

Comment (0)