బెజ్జూర్: 108 వాహనంలో మహిళ ప్రసవం

బెజ్జూర్: 108 వాహనంలో మహిళ ప్రసవం

బెజ్జూర్ మండలం డబ్బాగూడ గ్రామానికి చెందిన దాగాం సుజాత ఈ రోజు ప్రసవం కోసం 108 వాహనంలో వెళ్తున్న క్రమంలో ఆరెగూడ వద్ద 2వ కాన్పు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి కాన్పు సిజేరియన్ అయినప్పటికీ రెండవ కాన్పు సాధారణ ప్రసవం అయినట్లు ఈఎంటి వి.శేఖర్, పైలట్ జి.సంతోష్ తెలిపారు. ప్రసవ అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)