బీఆర్ఎస్ సభకు వచ్చే అతిథులకు వెండి వీణ
బీఆర్ఎస్ సభకు వచ్చే అతిథులకు వెండి వీణ
తెలంగాణ: ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ సభకు విచ్చేయనున్న వివిధ రాష్ట్రాల సీఎంలకు ఫిలిగ్రీ కళా నైపుణ్యంతో తయారు చేసిన వెండి వీణలను బహూకరించనున్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం పదిరోజుల క్రితం ఐదు వీణల కోసం సిక్కా సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో వీణను కిలోన్నర వెండితో తయారు చేశారు. వీటిని సోమవారం హైదరాబాద్కు తరలించారు. ఒక్కో వీణ ఖరీదు రూ. లక్ష యాభై వేల వరకు ఉంటుందని అంచనా.
Banka Srinivas