బహుజన రాజ్యాధికార యాత్ర సభకు బహుజనులంతా ఐక్యమై అత్యధిక సంఖ్యలో తరలిరావాలి

ఖమ్మం : నగరంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ , రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాపర్తినగర్ రమణగుట్ట 58వ డివిజన్ లో జరిగిన సమావేశంలో జిల్లా ముఖ్యసలహాదారులు మట్టి గురుమూర్తి

ఖమ్మం : నగరంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ , రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాపర్తినగర్ రమణగుట్ట 58వ డివిజన్ లో జరిగిన సమావేశంలో జిల్లా ముఖ్యసలహాదారులు మట్టి గురుమూర్తి మాట్లాడుతూ ఈ నెల 26వ తారీఖున ఆదివారం హన్మకొండలో జరిగే బహుజన రాజ్యాధికార సన్నాహక బహిరంగ సభను విజయవంతం చేయాలని , అత్యధిక సంఖ్యలలో బహుజనులందరూ కదలిరావాలని పిలుపునిచ్చారు . బహుజనుల అందర్నీ ఐక్యం చేయడానికి , దగాపడిన తెలంగాణలో బహుజనుల పాలనను తీసుకుని రావడానికి డాక్టర్ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజ్యాధికార యాత్ర ను ప్రారంభించాడని అది వందరోజులు పూర్తి చేసుకుంది అని అన్నారు . సబ్బండ కులాలకు సమాన లక్ష్యంగా కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మార్చడం కోసం ఈ బహుజన రాజ్యాధికార యాత్ర అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో బీఎస్పీ మహిళా జిల్లా కన్వీనర్ వి. విజయకుమారి , కుక్కల కృష్ణ , ఎస్కె అబ్దుల్ కరీమ్ , డి. సత్యనారాయణ , రాణి , బసవయ్య , అనిత , గోపగాని , సుజల్ తదితరులు పాల్గొన్నారు .

khaja

Comment As:

Comment (0)