ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ నియంత్రణపై అవగాహనడాక్టర్ బి.రామగిడ్డయ్య,జిల్లా వైద్యాధికారి
కల్లూరు మండలం,పర్ల గ్రామం, సచివాలయం వద్ద బుధవారం ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ నియంత్రణ అనే జాతీయ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.బి.రామగిడ్డయ్య హాజరై మాట్లాడుతూ ఫ్లోరోసిస్ అధికం
- By V.VKR --
- Wednesday, 13 Jul, 2022
కల్లూరు మండలం,పర్ల గ్రామం, సచివాలయం వద్ద బుధవారం ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ నియంత్రణ అనే జాతీయ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.బి.రామగిడ్డయ్య హాజరై మాట్లాడుతూ ఫ్లోరోసిస్ అధికంగా ఉన్న నీరు త్రాగడం వలన ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుందన్నారు. దీనివలన దంతాలు పసుపు, గోధుమ, నలుపు రంగులోకి మారుతాయని చెప్పారు. ఎముకల ఫ్లోరోసిస్ చిన్న పిల్లలు, వయోజనులకు, కీళ్ళు పట్టుకుపోవడం, ఎముకలు బిగుసుకొని పోవడం,దొడ్డి కాళ్ళు రావడం జరుగుతుందని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ బి ఎస్ కె & ఎన్ సీడి హేమలత మాట్లాడుతూ ఆకలి మందగించడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, అధికంగా దాహం వేయడం, గర్భవతులలో గర్భస్రావం అవ్వడం జరుగుతుందని తెలిపారు.ఫ్లోరోసిస్ జిల్లా కన్సల్టెంట్ డాక్టర్.సుధాకర్ మాట్లాడుతూ ఈ ఫ్లోరైడ్ బాధితులు బ్లాక్ టీ, వక్కలు,సైంధవ లవణం, పొగాకు ఉత్పత్తులు మరియు అధికంగా ఉన్న ప్లోరైడ్ టూత్ పేస్టు వాడడం తగ్గించాలని తెలిపారు.ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ నియంత్రణ అనే జాతీయ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేతి కర్రలు అందచేశారు.
V.VKR