ప్రజా పోరాటాలే ప్రజా సమస్యల సమస్యల పరిష్కారానికి మార్గం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలే మార్గమని, అందుకోసం ప్రజలు పోరాటాలకు సన్నద్ధం కావాలని, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, జి నాగయ్య గారు పిలుపునివ్వడం జర
- By khaja --
- Saturday, 12 Mar, 2022
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలే మార్గమని, అందుకోసం ప్రజలు పోరాటాలకు సన్నద్ధం కావాలని, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, జి నాగయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. శనివారం ఉర్సు గుట్ట రోడ్డులోని రామ సురేందర్ భవన్, జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల పట్టణ ప్రాంత కార్యకర్తల విస్తృత సమావేశం సింగారపు బాబు అధ్యక్షతన జరుగగా, ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య గారు మరియు రాష్ట్ర సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ జగదీష్ గారు హాజరై మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ప్రజాసంక్షేమానికి పెద్ద పీఠ వేశాం అని గొప్పలు చెప్పుతూ కేటాయింపులు తప్ప వాటిని ఖర్చు చేసి అభివృద్ధికి తోడ్పడిన దాఖలాలు లేవని అంకెల గారడీ గా బడ్జెట్లు కేటాయింపులు ఉన్నాయని నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు గాని, 57 సంవత్సరాల వారికి పెన్షన్ గాని, ఈ నగరంలో గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు గానీ, డ్రైనేజీ మంచినీరు మౌలిక సదుపాయాల కల్పనకుగాని, 30 లక్షల నిరుద్యోగ యువత ఉంటే కేవలం 80 వేల ఉద్యోగాలు ప్రకటించి 29 లక్షల నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి భరోసా ఇవ్వలేదని, రేషన్ కార్డులో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటన్నింటి పరిష్కారం కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూపే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని, ఇందుకోసం ప్రజలు పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగయ్య వ్యవసాయ కార్మిక సంఘం,ఐద్వా నలిగంటి రత్నమాల, సి ఐ టి యు ముక్కెర రామస్వామి, కెవిపిఎస్ ఆరూరి కుమార్, ఆవాజ్ బషీరు, సి ఐ టి యు నాయకులు సాగర్ ,ఏ యాదగిరి, ఇనుముల శ్రీనివాస్, pnm దుర్గయ్య, తదితర ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు
khaja