పోలీసులు వాహనాలు తనిఖీ
పోలీసులు వాహనాలు తనిఖీ
బెజ్జూర్ మండల కేంద్రంలో ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు కలిగి ఉండాలని చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లించాలని సూచించారు.
KOTA SAIKRISHNA