పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీ కేటీఆర్

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఈరోజు ప్రవాస భారతీయులు మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేండ్ల క్రితం పసికూన లాంటి తెలంగాణను ఇదే వేదిక నుండి పరిచయం చేశానని గుర్తుచేసారు. ఏడేండ్ల తరువాత నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ గురించి తెలియజెప్పడానికి వచ్చానని మంత్రి చెప్పారు.

అన్ని రంగాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్తానంలో ప్రవాస తెలంగాణ పౌరులు కలిసి నడవాలని మంత్రి పిలుపునిచ్చారు. మీరు పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే అలోచన మీలో ఉంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన "మన ఊరు మన బడి" కార్యక్రమంలో మీ ఊరిబడిని దత్తత తీసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.

khaja

Comment As:

Comment (0)