పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తాజాగా తెలంగాణ రాష్ట్ర పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తాజాగా తెలంగాణ రాష్ట్ర పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇక జూన్ 4వ తేదీ వరకు పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉండనున్నట్లు ప్రకటించింది. అయితే జూన్ నాలుగో తేదీ వరకు అప్లై చేసుకోని వారికి కూడా ఓ అవకాశాన్ని విద్యాశాఖ కల్పిస్తోంది. వంద రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పాలిసెట్ కోసం చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా జూన్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటనను విద్యాశాఖ విడుదల చేసింది.

khaja

Comment As:

Comment (0)