పట్టణ పరిధిలో వర్షానికి కూలిన ఇల్లు
పట్టణ పరిధిలో వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించరు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ . గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన వడ్డే నీలమ్మ ఇల్లు కూలిపోవడంతో సంఘటన
- By khaja --
- Sunday, 10 Jul, 2022
పట్టణ పరిధిలో వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించరు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ . గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన వడ్డే నీలమ్మ ఇల్లు కూలిపోవడంతో సంఘటన స్థలానికి వెళ్లిన చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం భర్త లేని బాధితురాలు వడ్డే నీలమ్మతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికారాబాద్ ఎమ్మార్వో షర్మిల గారితో ఫోన్లో మాట్లాడి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాలేవరు శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివసించరాదని, మున్సిపల్ పరిధిలో ఇలాంటి ఇండ్లు ఇంకా ఏమైనా ఉంటే అధికారులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చైర్ పర్సన్ తో పాటు , స్థానిక కౌన్సిలర్ దేవి రెడ్యానాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, నాయకులు రెడ్యానాయక్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
khaja