నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ అభినందనీయం
సమాచార హక్కు పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్ లోని నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిధిగా
సమాచార హక్కు పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్ లోని నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిధిగా పాల్గొని జిల్లా అధ్యక్షులు బండమీది అంజయ్య, ప్రధాన కార్యదర్శి కత్తి భాస్కర్ రెడ్డి ని అభినందించారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు చేయూత అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా మహిళా నాయకురాలు సదా లక్ష్మీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేపూరి సతీష్ కుమార్, సభ్యులు యాట మల్లయ్య, షేక్ అఖిల్, రాజేంద్ర ప్రసాద్, నరేందర్, కోటేష్ ప్రశాంత్, ప్రణయ్, స్వప్న పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram