నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సాధుల ప్రవీణ్ మాట్లాడుతూ
నిజాంసాగర్ : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సాధుల ప్రవీణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భారీ ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విఆర్ఎల పే స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల ఉపాధ్యక్షులు షాదుల్లా. కార్యదర్శి భూమయ్య. క్యాషియర్ విఠల్. ప్రతి గ్రామ వీఆర్ఏలు తదితరులు ఉన్నారు.
Abdul Raheem