ధ్యాన మందిర ఏర్పాటుకై వినతిపత్రం

ధ్యాన మందిర ఏర్పాటుకై వినతిపత్రం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఖమాన గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్ర మందిరమును ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ నివాసంలో శనివారం ఆమెను సర్పంచ్ పవన్, ఎంపిటిసి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసారు. అలాగే గ్రామపంచాయతీలో గల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జడ్పీ చైర్మన్ త్వరలో వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)