దువ్వాడ రైల్వే స్టేషన్ లో గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

దువ్వాడ రైల్వే స్టేషన్‌ నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేసేందుకు సిద్ధంగా వున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది అరెస్టు చేశారు. వీరి నుంచి *38 కిలోల గంజాయి, రెండు సెల్‌ ఫోన్లు, రూ.ఎనిమిది వేల నగదును స్వాధీనం చే

విశాఖ జిల్లా: దువ్వాడ రైల్వే స్టేషన్‌ నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేసేందుకు సిద్ధంగా వున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది అరెస్టు చేశారు. వీరి నుంచి 38 కిలోల గంజాయి, రెండు సెల్‌ ఫోన్లు, రూ.ఎనిమిది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని గంజాయి రవాణా ముఠాకు చెందిన విశాల్‌కుమార్‌ సింగ్‌, నితీశ్‌కుమార్‌ పాండేలు దువ్వాడ రైల్వే స్టేషన్‌ నుంచి చెన్నైకు రైలులో గంజాయి తరలించేందుకు సిద్ధపడుతుండగా రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

khaja

Comment As:

Comment (0)