తేనేటి విందులో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ఇవాళ రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. ఉజ్జ‌ల్ భూయాన్ చేత ప్ర‌మాణం

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ఇవాళ రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. ఉజ్జ‌ల్ భూయాన్ చేత ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకారం కార్య‌క్ర‌మం అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన తేనేటి విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మిళిసైతో కేసీఆర్ ముచ్చ‌టించారు. ఇక అక్క‌డే ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్, సీఎం, కేంద్ర మంత్రి మ‌ధ్య న‌వ్వులు విరిశాయి. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణస్వీకార కార్య‌క్ర‌మానికి శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, నిరంజ‌న్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, రాజ్య‌స‌భ స‌భ్యులు సురేశ్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)