ఘనంగా 37వ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి...

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన మహనీయుడు అని చిత్తూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వాడల గంగరాజు.

సిపిఎం పుత్తూరు టౌన్ .......... పుచ్చలపల్లి సుందరయ్య (1 మే 1913 – 19 మే 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన మహనీయుడు అని చిత్తూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వాడల గంగరాజు. నగరి నియోజకవర్గ సిపిఎం పార్టీ కార్యదర్శి ఆర్ వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం. పట్టణంలోని స్థానిక తిరుపతి రోడ్డు నందు ఆటో కార్మికుల తో కలిసి. 37వ సుందరయ్య వర్ధంతిన. సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు తెలియజేసారు‌. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూ. పుచ్చలపల్లి సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నారు. సహచరులు ఇతనును "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు. ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవారు. అలాంటి మహనీయుని కార్మికుల పక్షపాతి. మరిచిపోలేనని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఏ విజయ్. రమేష్. శివ. ప్రజాశక్తి సిబ్బంది. ప్రభాకర్. ఆటో కార్మికులు పాల్గొన్నారు. ‌ ‌ ‌. ‌

ravi

Comment As:

Comment (0)