జెడ్పీఎస్ఎస్ ముందు వీయూసి నిర్మించాలి

జెడ్పీఎస్ఎస్ ముందు వీయూసి నిర్మించాలి

వాంకిడి మండల కేంద్రంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో బాగంగా నిర్మిస్తున్న వీయూసి నిర్మాణంపై కొంత ఇబ్బందిగా ఉన్నదని దీనిని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ముందు నిర్మించాలని కోరుతూ శనివారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీకి విద్యార్థి సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో పాఠశాల ఎదురుగా వీయూసి నిర్మిస్తామని నిర్ణయించినప్పటికీ అక్కడ నిర్మాణం చేపట్టకుండా. ఇటు విద్యార్థులకు అటు గ్రాము పజలకు ఇబ్బందులు తలెత్తేలా నిర్మాణం. చేపడుతున్నారని ఆరోపించారు. గతంలో దీనిని ఎట్టి మస్థితుల్లో ఆపివేయాలని వివిధ పార్టీ, ప్రజా విద్యార్థి యువజన సంఘాలుగా పలు రూపాలలో నిరసనలు వ్యక్తం చేసినా దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారని అన్నారు. జెడ్పీఎస్ఎస్ పాఠశాల ముందు వీయూసి నిర్మించినట్లైతే విద్యార్థులకు, ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కావున విద్యార్ధులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా జెడ్పీ ఎస్ ఎస్ పాఠశాల ముందు నిర్మాణం చేపట్టగలరని విద్యార్థి సంఘ నాయకులు కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆత్మకూరి చిరంజీవి, దుర్గం దినకర్, డిసెల కార్తీక్ ఉన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)