జల్ జంగిల్ జమీన్ పరి రక్షణలో ఆదివాసీ గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ

అన్నపురెడ్డిపల్లి::జల్ జంగిల్ జమీన్ పరిరక్షణ కోసం ఆదివాసీ గిరిజనులు చేస్తున్న పోరాటంలో ఆదివాసీ గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అశ్వారావుపేట నియోజకవర్గంలోని రామన్నగూడెం,కంపగూడెం పలు ఆదివాసీ గూడెల్లో శనివారం నాడు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ

అన్నపురెడ్డిపల్లి::జల్ జంగిల్ జమీన్ పరిరక్షణ కోసం ఆదివాసీ గిరిజనులు చేస్తున్న పోరాటంలో ఆదివాసీ గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అశ్వారావుపేట నియోజకవర్గంలోని రామన్నగూడెం,కంపగూడెం పలు ఆదివాసీ గూడెల్లో శనివారం నాడు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యురాలు సున్నం నాగమణి తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఇన్చార్జి వనమా గాంధీ అధ్యక్షతన గురువారం నాడు అన్నపురెడ్డిపల్లి లో వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సున్నం నాగమణి మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో పోడు భూముల కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న ఆదివాసి గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు,భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య,కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా,మండల నాయకులు విచ్చేసి గిరిజనుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం పై ఉద్యమించనున్నట్లు తెలియజేశారు.ఆదివాసీ గిరిజనులు సుమారు నలభై-యాభై సంవత్సరాల నుండి సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు రైతుల చేతికి వచ్చే సమయానికి అటవీశాఖ అధికారులు రైతుల పై దాడులు చేసి పంటలు నాశనం చేయడమే కాకుండా అడవి బిడ్డల పై పోలీసులతో లాఠీచార్జి చేయించి బాలింతలు,మహిళలని చూడకుండా దాడులు చేపించి అక్రమ కేసులు పెట్టి,బేడీలు వేసి జైలుకు పంపుతున్నారని.ఇదేనా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దోరణి అని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పటికైనా స్పందించి పోడు సాగు దారులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకుని పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి ఆదివాసి గిరిజనులకు న్యాయం చేయాలని సున్నం నాగమణి డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కిసాన్ సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా పుల్లయ్య,కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు,కాంగ్రెస్ పార్టీ ములకలపల్లి మండల ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు,కాంగ్రెస్ పార్టీ దమ్మపేట మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్,ఇనపనూరి జమలయ్య,బొట్టు నరసింహారావు,జంగిల బిక్షమయ్య,ఇనుగంటి ప్రసాద్,అల్లు వెంకటరెడ్డి,చీకటి కన్నయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Korasa.Sriram

Comment As:

Comment (0)