జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యాసంస్థలో ఫీజు రాయితీకి డిఇఓ కు ఏపీడబ్ల్యుజెఎఫ్ వినతి.సానుకూలంగా స్పందిం

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పని చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రతి ఏడాది వారి పిల్లలకు విద్యాసంస్థలో ఫీజులో రాయితీ అందిస్తున్నారు. అదే విధానంలో ఈ విద్య సంవత్సరం కూడా జర్నలిస్ట్ పిల్లలకు రాయితీని అందించాలని ఏపీడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పని చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రతి ఏడాది వారి పిల్లలకు విద్యాసంస్థలో ఫీజులో రాయితీ అందిస్తున్నారు. అదే విధానంలో ఈ విద్య సంవత్సరం కూడా జర్నలిస్ట్ పిల్లలకు రాయితీని అందించాలని ఏపీడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు,నగర ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్ర,జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్, నగర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిఇఓ డాక్టర్ వి.రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా డిఈఓ డాక్టర్ వి. రంగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరంతరం ప్రజలకు, ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. కావున వారి పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యారాయితీ అందించేందుకు తప్పకుండ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు,నగర ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్రలు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో ఫీజు రాయితీ కల్పించేందుకు డిఇఓ సానుకూలంగా స్పందించడం హర్షనీయం అన్నారు.జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ పిల్లలకు త్వరలో ఫీజులో రాయితి అమలు చేపట్టేలా ఏపీడబ్ల్యుజెఎఫ్ కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యుజెఎఫ్ ఎప్పుడు ముందుంటుందని అలాగే జర్నలిస్ట్ ల దాడులు, అక్రిడేషన్ కార్డుల అమలు, హెల్త్ కార్డుల జారీ చేయించడంలో ఏపీడబ్ల్యుజెఎఫ్ కృషి ఎనలేనిదన్నారు.జర్నలిస్టుల సమస్యలు ఏవైనా తమ వంతు పోరాటం ఏపీడబ్ల్యుజెఎఫ్ బృందం ముందుండి చేస్తుందన్నారు.ఏపీడబ్ల్యుజెఎఫ్ చేస్తున్న పోరాటాలకు జర్నలిస్టులు కలిసిరావాలని,భవిష్యత్ లో మరింత ఉద్యమాలను జర్నలిస్టుల అభ్యున్నతికి ఏపీడబ్ల్యుజెఎఫ్ ముందుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర నాయకులు శ్రీరాములు, నాగేంద్రుడు,నజీర్ బాషా, సీనియర్ జర్నలిస్ట్ బురానుద్దీన్,తదితరులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)