చిరుత పులి దాడిలో నీలుగాయి మృతి

చిరుత పులి దాడిలో నీలుగాయి మృతి

చిరుత పులి దాడిలో నీలుగాయి మృతి చెందిన సంఘటన కడెం మండలంలోని గంగాపూర్ అడవి ప్రాంతంలో జరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. గంగాపూర్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఒక నీలుగాయి మృతి చెంది ఉండటాన్ని గమనించామని వారు వెల్లడించారు. సంఘటనా స్థలంలో పరిశీలించగా చిరుత పులి ఆ నీలుగాయిని చంపి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని అటవీ అధికారులు తెలిపారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)