చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి.శ్రీ లక్ష్మీ క్రేడో పాఠశాల ప్రిన్సిపాల్ టి. శ్రావ్య లక్ష్మీ
తూర్పుగోదావరి జిల్లా,మండపేట పట్టణంలో ఈ నెల 15 నుంచి17 వరకు జరుగుతున్న 40వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల సీనియర్ టెన్నికాయిట్ పోటీలలో ప్రాతినిథ్యం వహించే కర్నూలు జిల్లా
- By V.VKR --
- Thursday, 14 Jul, 2022
తూర్పుగోదావరి జిల్లా,మండపేట పట్టణంలో ఈ నెల 15 నుంచి17 వరకు జరుగుతున్న 40వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల సీనియర్ టెన్నికాయిట్ పోటీలలో ప్రాతినిథ్యం వహించే కర్నూలు జిల్లా జట్టుకు తాండ్రపాడులోని శ్రీలక్ష్మి క్రీడో ది స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.శ్రావ్యలక్ష్మి తెలియజేశారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు.తమ పాఠశాల నుంచి బాలికల విభాగంలో సౌమ్య శ్రీ,షైనీ కృప,పల్లవి,గ్రీష్మ లహరి బాలుర విభాగంలో వెంకటసాయి కుమార్ రెడ్డి,చరణ్,విశ్వనాథ్ రెడ్డి లు ఎంపికైనట్లు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు.తమ పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
V.VKR