గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి:ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ
త్రిపురారం మండలం త్రిపురారం మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు విద్యుత్ ట్రాన్స్ ఫారం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన.... ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే
- By khaja --
- Wednesday, 23 Mar, 2022
త్రిపురారం మండలం త్రిపురారం మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు విద్యుత్ ట్రాన్స్ ఫారం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన.... ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ గారితో కలిసి ట్రాన్స్ ఫరం ను ప్రారంభించారు. తదనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ.... గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో.... స్థానిక ఎంపీపీ అనుముల పాండమ్మ, మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్తీ భరత్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధూళిపాల రామచంద్రయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మాద ధనలక్ష్మి, మాజీ జెడ్పిటిసి ధన్ సింగ్ నాయక్, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ అనుముల అనంత రెడ్డి, అనుముల మండలం మాజీ ఎంపీపీ అల్లి పెద్దిరాజు యాదవ్, గ్రామ రైతు బంధు అధ్యక్షులు అనుముల శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
khaja