గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య
గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య
గుర్తు తెలియని మహిళ బాసర గోదావరి రెండవ ఘాట్ సమీపంపాలో నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం మద్యాహ్నం చోటు చేసుకుంది. బాసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 45 నుండి 50 ఏండ్ల వయస్సు గల గుర్తు తెలియని మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. జాలరుల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకు తీయించి ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు బాసర పోలీసులను సంప్రదించాలని కోరారు.
KOTA SAIKRISHNA